కొన్ని నెలల క్రితం అల్లు అర్జున్ హీరోగా లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో ఎఎ23 చిత్రాన్ని ప్రకటించినప్పుడు, సహజంగానే అందరి దృష్టి ఆ ప్రాజెక్ట్‌పై పడింది. అయితే అందులో ఒక చిన్న విషయం బన్నీ వ్యక్తిగతమైన భావాన్ని తెలియజేసింది. అదేంటంటే ఈ చిత్రానికి మైత్రీ మూవీ మేకర్స్‌తో పాటు, అల్లు అర్జున్‌కు అత్యంత సన్నిహితమైన నలుగురు స్నేహితులు ఈ సినిమాకు సహ నిర్మాతలుగా మారారు. ఇది కేవలం ఒక ప్రొడక్షన్ క్రెడిట్ మాత్రమే కాదు. ఇది స్నేహానికి ఇచ్చిన ఒక బలమైన సందేశం. ఇది ఫ్రెండ్ షిప్ డే స్పెషల్‌గా మారింది.

అల్లు అర్జున్ ఎఎ23 సినిమా కోసం సహ నిర్మాతలుగా మారిన స్నేహితుల్లో బన్నీ వాస్ కూడా ఉన్నారు. అలాగే ఈ ప్రాజెక్ట్‌లో ఆయన స్కూల్ డేస్‌లో స్నేహితులైన సందీప్ రామినేని, నటరాజ్ కూడా చేరారు. వీరితోపాటు అతని కజిన్, చిన్ననాటి స్నేహితురాలు స్వాతి కూడా భాగమయ్యారు. వీరి స్నేహ బంధం పేరు.. రికార్డులు, పాన్ ఇండియా విజయాల కంటే చాలా ముందే మొదలైంది.