
బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్‌కు మరోసారి బెదిరింపులు వచ్చాయి. సోషల్ మీడియా ద్వారా లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ పేరుతో ఓ బెదిరింపు సందేశం వచ్చినట్టు సమాచారం. ఈ బెదిరింపు సందేశంలో అమీర్ ఖాన్ మూడో వివాహాన్ని ప్రస్తావిస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం. అయితే, ఈ పోస్టులు, ఆడియోల ప్రామాణికతను ఇప్పటివరకు పోలీసులు ధ్రువీకరించలేదు. అర్జూ బిష్ణోయ్, టైసన్ బిష్ణోయ్ పేర్లతో విడుదలైన ఆ సోషల్ మీడియా పోస్టు, ఆడియోలో అమీర్ ఖాన్ మూడో వివాహాన్ని లవ్ జిహాద్‌గా అభివర్ణిస్తూ,
అలాంటి చర్యలను సహించబోమని హెచ్చరించారు. అమీర్ తన చర్యలకు మూల్యం చెల్లించాల్సి ఉంటుందని కూడా ఆ సందేశంలో పేర్కొన్నట్లు సమాచారం. ఇటీవల ఆమిర్ ఖాన్, గౌరీ స్ప్రాట్‌ను వివాహం చేసుకోవడంతో కొందరు రాజకీయ నాయకులు, మతపరమైన సంస్థలు విమర్శలు గుప్పించాయి.ఈ వివాదాలపై ఇప్పటికే అమీర్ ఖాన్ స్పందించారు. తన వివాహాల్లో మత మార్పిడి జరగలేదని స్పష్టం చేశారు. తన మాజీ భార్యలు రీనా దత్తా, కిరణ్ రావు, అలాగే ప్రస్తుత భార్య గౌరీ స్ప్రాట్ ఎవరూ తమ మతాన్ని మార్చుకోలేదని తెలిపారు.











