మన తెలంగాణ/హైదరాబాద్: పన్నెండు ఏళ్లుగా ఎపి ప్రభుత్వం ప్రతి బోర్డు సమావేశాల్లో తెలంగా ణ ప్రాజెక్టులను వ్యతిరేకిస్తుందని, ఇది కొత్త విషయం కాదని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఎపి ప్రాజెక్ట్‌లకు పరోక్షంగా మద్దతు ఇచ్చిన బిఆర్‌ఎస్ పార్టీ నేతలు అధికారం కోల్పోగానే కడుపు మంటతో బట్ట కాల్చి మీద వేస్తున్నారని మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి విరుచుకు పడ్డారు. తెలంగాణ రైతాంగం ప్రయోజనాలు కాపాడే విషయంలో రా జీ లేదని మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి స్పష్టం చేశా రు. రాష్ట్రంలో తొమ్మిదిన్నరేళ్లు అధికారంలో ఉన్న బిఆర్‌ఎస్ ఏ రోజు తెలంగాణ ప్రయోజనాలు కా పాడలేదని ఆయన అన్నారు. బిఆర్‌ఎస్ అధికారం లో ఉన్న సమయంలోనే రాయల సీమ ఎత్తిపోతల పథకం పనులు జరిగింది వాస్తవం కాదా..? అని మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి ప్రశ్నించారు. ఢిల్లీలో బుధవారం మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ పోలవరం- బనకచర్ల ప్రాజెక్ట్ పనులు ప్రారంభం అయ్యింది బిఆర్‌ఎస్ హయాంలోనేనని ఆయన తెలిపారు. పట్టి సీమ ఎత్తిపోతల పథకం బిఆర్‌ఎస్ అధికారంలో ఉండగా పూర్తి కా లేదా అని ప్రశ్నించారు.తొమ్మిదిన్నరేళ్లు తెలంగా ణ సొమ్మును లూటీ చేసి అధికారం కోల్పోగానే బి ఆర్‌ఎస్ మొసలి కన్నీరు కారుస్తుందని ఆయన మండిపడ్డారు.

ఈ నెల 18 వ తేదీన జరిగే జిఆర్‌ఎంబి మీటింగ్ అజెండాలో చేర్చిన అంశాలు కొత్తవేమి కాదని ఆయన తెలిపారు. ఇవే అంశాలను గత మీటింగ్‌లోనూ కరెస్పాండన్స్‌లలో కూడా ఎపి ప్రతిసారి ఇవే అంశాలను ప్రస్తావిస్తూ వస్తుందని మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి తెలిపారు. సీతారామ ఎత్తిపోతల పథకం క్లియరెన్స్‌ను కూడా ఎపి ప్రస్తావించిందని మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి పేర్కొన్నారు. దీనిపైన ఈ ప్రభుత్వం ధీటుగా స్పందించిందని అవన్నీ నిరాధారమైనవని జిఆర్‌ఎంబి, సిడబ్లూసీ దృష్టికి తీసుకువెళ్లి ఎస్‌ఎస్‌ఎంపి ఎస్‌ఆర్‌ఎల్‌ఐపి టిఏసి క్లియరెన్స్ (158 మీటింగ్ తేదీ 24.04.2025) నాటికి విజయవంతంగా అనుమతులు సాధించినట్టు మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి తెలిపారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఎపి నిరంతరం జిఆర్‌ఎంబి, సిడబ్లూసీ జల్‌శక్తి మంత్రిత్వ శాఖకు కాళేశ్వరం, సీతారామ, సమ్మక్క, చిన్న కాళేశ్వరం, చనాకా-కొరటా, మోదికుంట వాగు, గూడెం లిఫ్ట్ తదితర ఏడు ప్రాజెక్టుల అనుమతులు ఇవ్వరాదని కోరుతూ వచ్చిందన్నారు. ఎంఓజేఎస్ ద్వారా టిఏసి క్లియరెన్స్ పొందిన తరువాత కూడా సమీక్షించాలని ఎపి ప్రతి మీటింగ్‌లో ప్రస్తావించిందని ఆయన తెలిపారు. ఎపి లేవనెత్తిన అంశాలను తెలంగాణ ప్రభుత్వం ధీటుగా ప్రతిఘటించిందని, మన రాష్ట్ర నీటి హక్కులను కాపాడడంలో సఫలీకృతమయ్యిందన్నారు.


ఈ నెలాఖరులో ఎన్‌ఓసి ఇస్తామని చత్తీస్‌గఢ్ సిఎం చెప్పారు

ఇప్పటికే సమ్మక్కసాగర్ ఎన్‌ఓసి కోసం మూడుసార్లు ఛత్తీష్‌గడ్ సిఎం ను కలిసి ఎన్‌ఓసి కోసం విజ్ఞప్తి చేశామని మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి తెలిపారు. ఈ నెలాఖరులో ఎన్‌ఓసి ఇస్తామని ఛత్తీష్‌గడ్ సిఎం చెప్పారన్నారు. మీరు అధికారంలో ఉండగా ఒక్క సారి అయినా ఛత్తీష్‌గడ్ సిఎంను కలిశారా అని ఆయన ప్రశ్నించారు. ఆర్డీఎస్‌లో వాటా మేరకు నీళ్ల కోసం ఏ రోజు బిఆర్ ఎస్ ప్రయత్నం చేయలేదని, ఆర్డీఎస్ ఆధునీకరణ విషయంలో ఎపి, కర్ణాటక సిఎంలను ఒప్పించామని ఆయన తెలిపారు. గత ప్రభుత్వం కంటే ఎపి ప్రాజెక్టులపై సమర్థవంతంగా వాదనలు వినిపిస్తున్నామన్నారు. రాష్ట్ర ప్రజల నీటి హక్కులను పరిరక్షించి, కాపాడేందుకు ప్రస్తుత ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని మంత్రి ఉత్తమ్ తెలిపారు. బిఆర్‌ఎస్ ద్వంద విధానాలతో తాము నేర్చుకునేది ఏమీ లేదని ఆయన అన్నారు. తొలుత కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో ఎపి కాంట్రాక్టర్‌ల నుంచి ముడుపులు అందాయనే కవిత ఆరోపణలకు జవాబు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. అ ముడుపుల్లో నీ వాటా ఎంత అని మంత్రి ఉత్తమ్ ప్రశ్నించారు. తెలంగాణలో అధికారం లో రావడం లేదని ఎపితో కుమ్మక్కై నాగార్జున సాగర్ ప్రాజెక్టును వివాదం చేసింది మీరు కాదా.? రూ.లక్ష కోట్లు పెట్టి కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టును నిండా ముంచి సిగ్గు లేకుండా రాజకీయాలు చేస్తావా అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నిలదీశారు.