నిజామాబాద్: ఓ వ్యక్తి కారు కిరాయికి తీసుకొని వెళ్తున్నాడు. మార్గం మధ్యలో డ్రైవర్‌కు ఆరటిపండ్లు తీసుకరావాలని సూచించాడు. డ్రైవర్ కారు దిగి రోడ్డుకు అటువైపు వెళ్లగానే అతడు కారుతో పారిపోయాడు. ఈ సంఘటన నిజామాబాద్ జిల్లా కేంద్రానికి సమీపంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... ఓ వ్యక్తి కారు అడ్డాకు వచ్చి నాందేడ్‌కు కారును కిరాయి మాట్లాడుకున్నాడు. కారు డ్రైవర్ కమ్ యజమాని కుద్రిత్ బేగమ్ తో సదరు వ్యక్తి నాలుగు వేల రూపాయలకు కిరాయి కుదుర్చుకున్నాడు. నిజామాబాద్‌లోని గాంధీచౌక్‌కు రాగాను డ్రైవర్‌కు అరటి పండ్లు తీసుకరావాలని కిరాయిదారుడు కోరాడు. అరటి పండ్లు తీసుకరావడానికి డ్రైవర్ రోడ్లు అవతలి వైపుకు వెళ్లాడు. కిరాయి తీసుకున్న వ్యక్తి డ్రైవర్ సీట్లోకి మారి కారుతో పారిపోయాడు. కారు యజమాని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.