ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. ప్రముఖ అంతర్జాతీయ మ్యాగజైన్ ఫోర్బ్స్ కవర్ పేజీపై ఆయన కనిపించారు. వివిధ రంగాల్లో రాణించిన 100 మంది తారల జాబితాను షో స్టాపర్స్ - 2026 పేరుతో ఫోర్బ్స్ ఇండియా విడుదల చేసింది. ఈ లిస్ట్‌లో అల్లు అర్జున్ కూడా ఉన్నారు. ఆయనతో పాటు రామ్ చరణ్, అమితాబ్, మోహన్ లాల్, రజనీకాంత్, షారుక్ ఖాన్, ఆమిర్ ఖాన్, అక్షయ్ కుమార్, ఎఆర్ రెహమాన్, బాబీ డియోల్, దుల్కర్ సల్మాన్, మాధవన్, రణ్‌వీర్ సింగ్, రిషబ్ శెట్టి, కల్యాణి ప్రియదర్శన్, కంగనా రనౌత్ కూడా ఉన్నారు.

ఇక ప్రస్తుతం బన్నీ.. అట్లీ దర్శకత్వంలో ‘రాకా’ అనే సినిమాలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ముంబైలో జరుగుతోంది. ఈ సినిమాలో దీపికా పదుకొనే హీరోయిన్‌గా నటిస్తోంది. అంతేకాక మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్, రష్మిక మందన్నా కూడా నటిస్తున్నారని టాక్ ఉంది. ఈ చిత్రంలో బన్నీ ట్రిపుల్‌ రోల్ చేస్తున్నారని మరో టాక్.