
- పెర్క శ్రీజ కు రెండో సంవత్సరం పీజు చెల్లించిన హరీష్ రావు..
- ఎంబిబిఎస్ సీటు సాధించిన పేద దళిత విద్యార్థినికి మాజీ మంత్రి హరీష్ రావు చేయూత
- బిఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన గురుకుల పాఠశాలలో చదివి ఎంబిబిఎస్ సీటు సాధించిన పెర్క శ్రీజ
- తన కూతురుకు ఎంబిబిఎస్ సీటు వచ్చినా.. తనకు చదివించే ఆర్థిక స్తోమత లేదని హరీష్ రావు అర్జీ పెట్టుకున్న విద్యార్థిని తండ్రి శ్రీనివాస్
- ఎంబిబిఎస్ డాక్టర్ రెండో సంవత్సరం రూ. 60 వేల ఆర్థిక సాయం అందించిన హరీష్ రావు..
- ఎంబిబిఎస్ పూర్తి అయ్యే వరకు ప్రతి ఏటా కళాశాల ఫీజు తానే చెల్లెస్తానని భరోసానిచ్చిన హరీష్ రావు..
- పేద దళిత కుటుంబంలో వెలుగులు నింపిన మన సిద్దిపేట అభివృద్ధి ప్రదాత హరీష్ రావు..
- మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు..
సిద్దిపేట పట్టణం లోని పేద దళిత కుటుంబానికి చెందిన పెర్క శ్రీజ కరీంనగర్ చెల్మడ ఆనంద్ రావు వైద్య కళాశాల లో ఎంబిబిఎస్ సీటు సాధించింది.. గత సంవత్సరం ఫీజు చెల్లించిన హరీష్ రావు రెండో సంవత్సరం పీజు రూ. 60వేలు ఈరోజు అందజేశారు.. శ్రీజ తండ్రి శ్రీనివాస్ ఎదో చిన్న చిన్న పనులు చేస్తూ సంపాదిస్తూ ఉంటాడు.. ఆయన సంపాదన కుటుంబ పోషణకు చాలదు.. కూతురు శ్రీజ చిన్నప్పటి నుండి చదువు లో ముందంజ లో ఉంటుంది.. 5వ తరగతి నుండి ఇంటర్మిడియట్ వరకు మిట్టపల్లి రెసిడెన్షియల్ లో చదువు కొని, గత సంవత్సరం నీట్ ర్యాంక్ సాధించింది..ఎంబిబిస్ చేయాలి డాక్టర్ కావాలి అనే ఆమె ఆశయం కు ఆర్థిక స్థోమత అడ్డు వస్తుంది.. తన తండ్రి శ్రీనివాస్ మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు కలసి నా బిడ్డ వైద్య విద్య కు మీరు సహాయం చేయాలి.. నాకు చదివించే స్థోమత లేదు అని హరీష్ రావు ను వేడుకున్నారు.. ఈ సందర్బంగా హరీష్ రావు గారు ఆందోళన చెందవద్దు మీ బిడ్డను చదివించే బాధ్యత నాది అని గత సంవత్సరం కు అయ్యే కళాశాల ఫీజు 60వేలు రూపాయలు వారికీ అందించారు.. శ్రీజ వైద్య విద్య పూర్తి అయ్యే వరకు తాను ఫీజు చెల్లిస్తా అని హామీ ఇచ్చారు ఇచ్చిన మాటకు ఈ రెండో సంవత్సరం పీజు కూడా 60వేలు చెల్లించారు... ఈ సందర్బంగా క్యాంప్ కార్యాలయం లో శ్రీజకు అందజేశారు.. డాక్టర్ కావాలని శ్రీజను ఆశీర్వదించారు..సిద్దిపేట నియోజకవర్గం లో పేద విద్యార్థుల చదువు కు తాను ఎల్లప్పుడూ ముందుంటానన్నారు.. ప్రభుత్వ వైద్య కళాశాలో సిటు తెచ్చుకున్న విద్యార్థికి పీజు కడతాను అని, పీజు నాది.. సీటు మీది అని ఈ సందర్బంగా పేర్కొన్నారు.
హరీష్ రావు ఋణపడి ఉంటాం..
నా బిడ్డ కు డాక్టర్ కావాలి అనే ఆశయం.. అ ఆశయానికి ఆర్థిక స్థోమత అడ్డు.. అలాంటి పరిస్థితి లో మీ సహాయం కావాలి హరీష్ అన్న అని హరీష్ అన్న దగ్గరికి వెళితే నేను ఉన్న నీ బిడ్డను చదివిస్తా డాక్టర్ కల నెరవేరుస్తా అని ఆర్థిక సహాయం ఇచ్చి.. నాలుగేళ్ళ వైద్య విద్య నేనే చదివిస్తా అని హరీష్ రావు భరోసానివ్వడం ఎంతో సంతోషం గా ఉందని పెర్క శ్రీనివాస్.. బిడ్డ శ్రీజ లు సంతోషం వ్యక్తం చేసారు.. హరీష్ రావు సార్ కి ఎల్లప్పుడూ ఋణపడి ఉంటామన్నారు...








