భోపాల్: బైక్‌పై వెళ్తున్న దంపతులు అటవీ ప్రాంతంలోకి లాక్కెళ్లి వారిపై దాడి చేసి బంగారు ఆభరణాలు, నగదును దొచుకున్నారు. మహిళపై అత్యాచారం చేయడానికి ప్రయత్నిస్తుండగా వారిని పోలీసులు పట్టుకున్న సంఘటన మధ్య ప్రదేశ్ రాష్ట్రం గుణా జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... దంపతులు దేవాలయానికి వెళ్లి వస్తుండగా మార్గం మధ్యలోని గాదేర్ గ్రామ శివారులోని ఓ పెట్రోల్ పంపు దగ్గర వారిని ఐదుగురు అడ్డగించారు. అనంతరం దంపతులను అటవీ ప్రాంతంలోకి లాక్కెళ్లి వారిపై దాడి చేశారు. వారిని లాక్కెళ్లుతుండగా ఓ వ్యక్తి గమనించి పెట్రోలింగ్‌కు వచ్చిన పోలీసులకు సమాచారం ఇచ్చాడు. దంపతుల వద్ద నుంచి బంగారు ఆభరణాలు, నగదును లాక్కున్నారు. భర్తపై ముందు భార్యపై అత్యాచారం చేస్తుండగా పోలీసులు అక్కడికి చేరుకొని ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. దంపతులు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి ఐదుగురు బబ్లూ బంజారా(23), చోటు బంజారా(28), సర్దార్ బంజారా(30), మహేంద్ర బంజారా(20), దినేష్ బంజారా(28)ను అరెస్టు చేసి రిమాండ్‌ఉ తరలించారు.