
టాలెంటెడ్ బ్యూటీ శ్రీలీల బాలీవుడ్‌లో రెండు, మూడు ప్రాజెక్ట్‌ల్ని లాక్ చేసింది. వాటిలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న ‘ఆషీకీ 3’ ఒకటి. కార్తీక్ ఆర్యన్ హీరోగా అనురాగ్ బసు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ రొమాంటిక్ మ్యూజికల్ చిత్రంలో శ్రీలీల పాత్ర ఎంతో కీలకమైంది. ఇప్పటికే చిత్రానికి సంబంధించి కొంత భాగం షూటింగ్ పూర్తయింది. అనంతరం యూనిట్ షూటింగ్ కి కొంత బ్రేక్ ఇచ్చింది.
ఈ నేపథ్యంలో తాజాగా ముంబై కొత్త షెడ్యూల్లో శ్రీలీల తిరిగి షూటింగ్‌లో పాల్గొంటున్నట్లు సమాచారం. ముంబైలోని ప్రత్యేకంగా వేసిన భారీ సెట్లలో కీలకమైన రొమాంటిక్ సన్నివేశాలతో పాటు, కొన్ని మ్యూజికల్ సాంగ్స్‌ను యూనిట్ తెరకెక్కిస్తోంది. ఈ సినిమాలో కార్తీక్ ఆర్యన్, - శ్రీలీల జోడీ చూడచక్కగా ఉందని, ఇద్దరి మధ్య ఆన్-స్క్రీన్ కెమిస్ట్రీ సినిమాకే హైలైట్‌గా నిలుస్తుందని చిత్ర వర్గాలు చెబుతున్నాయి.











