
గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, సంచలన దర్శకుడు కొరటాల శివ కలయికలో తెరకెక్కుతున్న చిత్రాన్ని ఎస్‌ఎల్‌వి సినిమాస్, యువసుధ ఆర్ట్ బ్యానర్లపై నిర్మాతలు సుధాకర్ చెరుకూరి, సుధాకర్ మిక్కిలినేని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఇటీవల అమరావతిలో జరిగిన పూజా కార్యక్రమంతో ఘనంగా ప్రారంభమైన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాలో హీరోయిన్ ఐశ్వర్య రాజేశ్ ఓ పాత్రలో కనిపిస్తోందట. ఈ చిత్రంలో ఆమె నెగటివ్ పాత్రలో నటించనుందని తెలిసింది. ఇది ఆమె కెరీర్‌లో ఒక కొత్త మలుపు అని చెప్పవచ్చు. నెగిటివ్ షేడ్ ఉన్న పాత్రలో ఆమె నటనలో కొత్త కోణాన్ని చూడవచ్చు. ఇక ఈ సినిమా సెకండ్ హాఫ్ లో వచ్చే ఫ్లాష్‌బ్యాక్‌లో బాలయ్య బాబు సరికొత్త లుక్ లో కనిపించబోతున్నాడు.
ఫ్లాష్ బ్యాక్‌లో బాలయ్య బాబు పాత్ర మాఫియా నేపథ్యంలో ఉంటుందట. మొత్తానికి ఈ సినిమాలో బాలకృష్ణను పూర్తిస్థాయి మాస్ అవతార్‌లో చూపించనున్నాడు కొరటాల శివ. పైగా ఈ సినిమాలో ఫ్యామిలీ ఎమోషన్స్ ప్రధానంగా ఉంటాయని తెలుస్తోంది. స్టోరీ కూడా ప్రత్యేకంగా ఉంటుందట. కథపై కొరటాల బాగా కసరత్తులు చేశాడట. ఇక ఈ సినిమాలో బాలకృష్ణను ఢీకొట్టే పవర్‌ఫుల్ విలన్ పాత్ర కోసం సీనియర్ హీరో, యాంగ్రీ యంగ్ మ్యాన్ రాజశేఖర్‌ను ఎంపిక చేసినట్లు గట్టిగా టాక్ వినిపిస్తోంది. బాలయ్య, రాజశేఖర్‌ల మధ్య వచ్చే మైండ్ గేమ్స్, యాక్షన్ సీన్స్ థియేటర్లలో పూనకాలు తెప్పిస్తాయని అంటున్నారు.











