అహ్మదాబాద్: గుజరాలోని అహ్మదాబాద్‌లో ఓ బాణాసంచా కర్మాగారంలో భారీ పేలుడు సంభవించింది. నగర శివారులోని రామోల్ ప్రాంతంలో జరిగిన ఈ ఘటనలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 10 మందికి పైగా గాయపడ్డారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఫ్యాక్టీర లైసెన్సు రద్దు చేసినప్పటికీ.. అక్కడ అక్రమంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని.. ఈ క్రమంలోనే ఓ యూనిట్‌లో పేలుడు సంభవించినట్లు సమాచారం. ఘటనాస్థలికి చేరుకున్న రెస్క్యూ బృందాలు.. సహాయక చర్యలు చేపట్టాయి. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.