
బౌరంపేట ఇందిరమ్మ కాలనీ కబ్జాలపై దుండిగల్ మున్సిపల్ అధికారుల చర్యలు
కుత్బుల్లాపూర్: మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం బౌరంపేట్ ఇందిరమ్మ కాలనీ లో కబ్జాకు గురైన బతుకమ్మ కుంటను దుండగల్ సర్కిల్ అధికారులు కాపాడారు. ప్రభుత్వ స్థలంలో వెలసిన అక్రమ షెడ్లను డిప్యూటీ కమిషనర్ వెంకట మణికిరణ్ ఆధ్వర్యంలో, టౌన్ ప్లానింగ్ ఎసిపి శ్రీనివాస్ నేతృత్వంలో దుండిగల్ పోలీస్ బందోబస్తు మధ్య కూల్చివేత లు చేపట్టారు. అక్రమ షెడ్ల కుల్చివేతపై ఇందిరమ్మ కాలనీ మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.








