
న్యూ ఢిల్లీ: హోరాహోరీగా సాగిన పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం ఎవరిదనే విషయంపై ఉత్కంఠ నెలకొంది. గెలుపుకు సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ అంచనాలు వెలువడుతున్నాయి. అధికార తృణమూల్ 177187, భాజపా 95110 స్థానా ల్లో విజయం సాధిస్తుందని పీపుల్స్ పల్స్ అంచనా వేసింది. టీఎంసీ 125140, భాజపా 146161 చోట్ల విజయం సాధిస్తుందని మ్యాట్రిజ్ సర్వే వెల్లడించింది. పీమార్క్ సర్వే మాత్రం తృణమూల్ 118138 స్థానాలు, భాజపా 150175 స్థానా ల్లో గెలుపొందే అవకాశం ఉందని పేర్కొంది. చాణక్య స్ట్రాటజీస్ కూడా భాజపా వైపే మొగ్గు చూపాయి. భాజపాకు 150160 సీట్లు, తృణమూ ల్ కాంగ్రెస్‌కు 130140 స్థానాలు గెలిచే అవకాశం ఉందని తెలిపింది.
తమిళనాడులో మరోసారి డీఎంకే..
ఏప్రిల్ 23న తమిళనాడులో హోరాహోరీగా జరిగిన ఎన్నికల్లో అధికార డీఎంకే పార్టీ మరోసారి సత్తా చాటబోతోందని మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ సంస్థలు అంచనాలు వెలువడుతున్నాయి. ముక్కోణపు పోరులో డీఎంకే పార్టీ విజయ దుందుభి మోగించనుందని అంచనా వేశాయి. భాజపాతో కలిసి బరిలో దిగిన అన్నాడీఎంకేకు మరోసారి నిరాశ తప్పదని సర్వేలు చెబుతున్నాయి. సినిమాల నుండి రాజకీయాల్లోకి అడుగుపెట్టిన విజయ్‌పార్టీ టీవీకే మూడో స్థాయికే పరిమితమవుతుందని మెజారిటీ సర్వేలు అంచనా వేశాయి. 234 స్థానాలకు గానూ తమిళనాడులో పోలింగ్ జరిగింది. అధికారం చేపట్టాలంటే 118 స్థానాలు అవసరం. మెజారిటీ సర్వేలు డీఎంకే అధికారంలోకి రావచ్చని అంచనా వేశాయి. పీపుల్స్ పల్స్ సర్వే ప్రకారం డీఎంకే 125 145 స్థానాలను పొందుతుందని అంచనా. అన్నాడీఎంకే 6580 స్థానాలకు, టీవీకే 1824, ఇతరులు 06 స్థానాలకు పరిమితమవుతారని అంచనా వేసింది. మ్యాట్రిజ్ సర్వే ప్రకారం డీఎంకే 122132 స్థానాలు,
అన్నాడీఎంకే 87100, టీవీకే 10 12, ఇతరులు 06 స్థానాలను సాధిస్తాయని అంచనా. పీమార్క్ సర్వే ప్రకారం డీఎంకే 125145, అన్నాడీఎంకే 65 85, టీవీకే 16 26, ఇతరులు 16 స్థానాలను సాధిస్తాయని అంచనా వేసింది. పీపుల్స్ ఇన్‌సైట్ సర్వే ప్రకారం డీఎంకే 120140, అన్నాడీఎంకే 6070, టీవీకే 3040, ఇతరులు 04 స్థానాల కు పరిమితవుతాయని అంచనా. ప్రజాపోల్ సర్వే డీఎంకే 148168, అన్నాడీఎంకే 61 81, టీవీకే 19 స్థానాలను పొందుతాయని అంచనా. కామ క్య అనలటిక్స్ సర్వే ప్రకారం డీఎంకే 7895, అన్నాడీఎంకే 6884, టీవీకే 6781 స్థా నాలను పొందుతాయని అంనా. జేవీసీ సర్వే ప్ర కారం డీ ఎంకే 7595, అన్నాడీఎంకే 128147, టీవీకే 815 స్థానాలను పొందుతాయని అంచనా. అయి తే ఎన్డీటీవీయాక్సిస్ మై ఇండియా కలిసి నిర్వహించిన సర్వే మాత్రం విజయ్ నేతృత్వంలోని టీవీకేకు ఎక్కువ స్థానాలు వచ్చే అవకాశం ఉందని అంచనా వేసింది. జేవీసీ అనే సర్వే సంస్థ అన్నాడీఎంకే కూటమికి అధికారం రావచ్చని అంచనా వేసింది.
పుదుచ్చేరిలో..
కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో అధికార ఆలిండియా ఎన్‌ఆర్ కాంగ్రెస్ భాజాపా కూటమి మరోసారి అధికారంలోకి రావచ్చని పలు సర్వేలు చెబుతున్నాయి. 30 స్థానాల్లో ఎన్నికలు జరిగాయి. మె జారిటీ సర్వేలు ఎన్‌ఆర్ కాంగ్రెస్ కూటమి వైపు మొ గ్గుచూపాయి. కాంగ్రెస్, డీఎంకే కూ టమి రెండో స్థానానికి పరిమితం కానున్నాయి. ప్రజాపోల్‌సర్వే ప్రకారం ఎన్‌ఆర్‌సీ 1925 స్థానాలు, కాంగ్రెస్ 6 10 స్థానాలు గెలుచుకోనున్నాయని అంచనా. కా మక్య అనలటిక్స్ సర్వే ప్రకారం ఎన్‌ఆర్‌సీ 1724, కాంగ్రెస్47, టీవీకే 12, ఇతరులు 01కు పరిమితమవుతాయని అంచనా. యాక్సిస్ మై ఇం డియా సర్వే ప్రకారం ఎన్‌ఆర్‌సీ 1620 స్థానా లు, కాంగ్రెస్ 68, టీవీకే 24, ఇతరులు 13 స్థానాలను పొందుతాయని అంచనా. పీపుల్స్పల్స్ ప్రకా రం ఎన్‌ఆర్‌సీ 1619 స్థానాలు, కాం గ్రెస్ 1012, ఇతరులు 12 స్థానాలు గెలుచుకోనున్నాయని అంచనా.
కేరళలో ఎల్‌డీఎఫ్‌కు షాక్..
కేరళలో సీపీఎం నేతృత్వంలోని అధికార ఎల్‌డీఎఫ్‌కు ఈసారి గట్టి షాక్ తగలనుంది. విజయన్ నేతృత్వంలో రెండుసార్లు అధికారంలోకి వచ్చిన కూటమికి ఈసారి ఎన్నికల్లో ఎదురుగాలి తప్పదని మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ సంస్థలు అంచనా వేశాయి. కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్‌కు ఈసారి ఓటర్లు పట్టం కట్టనున్నట్లు అభిప్రాయపడ్డాయి. భాజపా ఈసారి ఎన్నికల్లో ఖాతా తెరిచే అవకాశం ఉందని అంచనా వేస్తున్నాయి. కేరళలో 140 స్థానాలకు గాను ఏప్రిల్ 9న పోలింగ్ జరిగింది. ఎల్‌డీఎఫ్, యూడీఎఫ్ మధ్యే ప్రధాన పోరు సాగింది. సాధారణంగా కేరళలో ఐదేళ్లకోసారి అధికార మార్పిడి జరుగుతూ వస్తోంది. కానీ, 2021 ఎన్నికల్లో ఎల్‌డీఎఫ్ రెండోసారి అధికారంలోకి వచ్చింది.
ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో యూడీఎఫ్ సత్తా చాటింది. అవే ఫలితాలు అసెంబ్లీ ఎన్నికల్లోనూ ప్రతిఫలించనున్నాయని సర్వే సంస్థలు పేర్కొంటున్నాయి. యాక్సిస్ మై ఇండియా సర్వే ప్రకారం యూడీఎఫ్ 7890, ఎల్‌డీఎఫ్ 4962, భాజపా03 స్థానాలను గెలుచుకుంటాయని అంచనా. పీపుల్స్పల్స్ సర్వే ప్రకారం యూడీఎఫ్ 7585, ఎల్‌డీఎఫ్ 5565, భాజపా 03 స్థానాలను గెలుచుకుంటాయని అంచనా. ఓట్‌వైబ్ సర్వే ప్రకారం యూడీఎఫ్ 7080, ఎల్‌డీఎఫ్ 5868, భాజపా 04 స్థానాలను గెలుచుకుంటాయని అంచనా. పీపుల్స్ ఇన్‌సైట్ సర్వే ప్రకారం యూడీఎఫ్ 6676, ఎల్‌డీఎఫ్ 5868, భాజపా 1014, ఇతరులు 01 స్థానాలను గెలుచుకుంటాయని అంచనా.
అస్సాంలో మరోసారి బిజెపి
అస్సాంలో మరోసారి భాజపానే అధికారంలోకి వస్తుందని ఎగ్జిట్‌పోల్స్ అంచనా వేశాయి. యాక్సిస్‌మై ఇండియా సర్వే ప్రకారం భాజ పా కూటమి 88100, కాంగ్రెస్ కూటమి 2436 స్థానాలు గెలుస్తాయని అంచనా. మ్యాట్రిజ్ సర్వే ప్రకారం భాజపా కూటమి 8595, కాంగ్రెస్ కూటమి 2532 స్థానాలు గెలుస్తాయని అంచనా. పీపుల్స్ పల్స్ సర్వే ప్రకారం భాజపా కూటమి 6872, కాంగ్రెస్ కూటమి 2226 స్థానాలు గెలుస్తాయని అంచనా. చాణక్య స్ట్రాటజీస్ ప్రకారం భాజపా కూటమి 8898, కాంగ్రెస్ కూటమి 2232 స్థానాలు గెలుస్తాయని అంచనా. పీమార్క్ సర్వే ప్రకారం భాజపా కూటమి 8294, కాంగ్రెస్ కూటమి 3040 స్థానాలు గెలుస్తాయని అంచనా. ఓట్‌వైబ్ సర్వే ప్రకారం భాజపా కూటమి 90100, కాంగ్రెస్ కూటమి 2333 స్థానాలు గెలుస్తాయని అంచనా.










