
హైదరాబాద్: బెంగాల్ లో బిజెపి ఎలా గెలిచిందో ప్రజలకు తెలుసు అని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య తెలిపారు. తెలంగాణపై ప్రధాని నరేంద్ర మోడీవి పగటి కలలు కంటున్నారని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రతి రాష్ట్రంలో అధికారం కావాలని అడ్డదారిలో ప్రయత్నిస్తున్నారని, బెంగాల్ లో 90 లక్షల ఓట్లు తొలగించారని బీర్ల ఐలయ్య విమర్శించారు. బిజెపి, బిఆర్ఎస్ కలిసొచ్చినా కాంగ్రెస్ కు పోటీ కాలేరని, మళ్లీ గెలిచేది కాంగ్రెస్సేనని..సిఎం అయ్యేది రేవంత్ రెడ్డి అని బీర్ల ఐలయ్య సవాల్ విసిరారు.















