హైదరాబాద్: బల్కంపేట బోనాల సందర్శంగా ఆర్‌టిసి అధికారులు నగరంలోని 18 డిపో నుంచి భక్తుల సౌకర్యం కోసం 80 బస్సులను నడుపుతున్నట్లు ఆర్‌టిసి అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ బస్సులు మంగళవారం భక్తుల సౌకర్యం కోసం అందుబాటులో ఉంచుతున్నట్లు చెప్పారు.

రాణి గంజ్ డిపో నుంచి6, కంటోన్మెంట్ డిపో నుంచి 6, బర్కత్‌పురా డిపో నుంచి 4, మిధాని డిపో నుంచి 6, హెచ్‌సియు డిపో నుంచి 6, కుషాయిగూడ నుంచి 4, మెహదీపట్నం డిపో నుంచి 8, కాచిగూడ నుంచి 5, హయాత్‌నగర్ డిపో నుంచి 2 ,దిల్‌షుక్‌నగర్ డిపో నుంచి 5,ఫరూక్‌నగర్ డిపో నుంచి 4, జీడిమెట్ల డిపో నుంచి 4, ఉప్పల్ డిపో నుంచి 4, మియాపూర్ డిపో2 నుంచి 4, ముషీబాద్ డిపో నుంచి 4,కంటోన్మెంట్ డిపో నుంచి 3, కూకట్ పల్లి డిపో నుంచి 5 బస్సులు మొత్తం 80 బస్సులను బల్కం పేట బోనాల సందర్భంగా భక్తుల సౌకర్యం ఉపయోగిస్తున్నామంటున్నారు.