భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ), భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డివైఎఫ్ఐ), అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) తెలంగాణ రాష్ట్ర కమిటీల ఆధ్వర్యంలో.. హైదరాబాద్ ఆర్‌టీసీ క్రాస్ రోడ్స్ వద్ద బండి సంజయ్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.

తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ నేత, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడి, అనంతరం బెదిరింపులకు దిగడమే కాకుండా కేసును సెటిల్ చేసుకునే ప్రయత్నాలు జరగడం అత్యంత దారుణమని వారు తీవ్రంగా ఖండించారు.