రోజురోజుకూ ఎండలు తీవ్రరూపం దాల్చడంతో ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. మండుతున్న ఎండలతో ప్రజలు, మూగజీవాలు దాహార్తితో అల్లాడుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్‌రావు మండలంలోని పెద్దతూండ్ల గ్రామంలో ఉపాధి హామీ పనుల్లో పాల్గొంటున్న కూలీలకు గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఎండ తీవ్రత నుంచి ఉపశమనం కలిగించేలా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు గ్రామ పెద్దలు తెలిపారు. కూలీలు సర్పంచ్‌కు కృతజ్ఞతలు తెలిపారు.