కేంద్ర మంత్రి బండి సంజయ్ తన కుమారుడు బండి భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసుపై స్పందించారు. కరీంనగర్‌లో జరిగిన హిందూ ఏక్తా యాత్రలో మాట్లాడుతూ.. ప్రజా జీవితంలో బిజీగా ఉండటంతో తన కుమారుడికి సమయం ఇవ్వలేకపోయానన్నారు. తన కుమారుడిని క్రిమినల్‌గా చూపించే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. అయితే, చట్టాన్ని గౌరవిస్తానని.. తప్పు చేసినట్లు తేలితే తన కుమారుడినైనా క్షమించనని స్పష్టం చేశారు.
ఇక ఓ మైనర్ బాలిక ఫిర్యాదు మేరకు పేట్ బషీర్‌బాద్ పోలీసులు బండి భగీరథ్‌పై పోక్సో కేసు నమోదు చేశారు. కేసు దర్యాప్తును వేగవంతం చేసిన పోలీసులు.. మహిళా ఐపీఎస్ అధికారి రితిరాజ్‌ను పర్యవేక్షణ అధికారిగా నియమించారు. నిష్పక్షపాత దర్యాప్తు జరిపి ప్రతిరోజూ పురోగతి నివేదిక సమర్పించాలని సైబరాబాద్ సీపీ ఆదేశించారు.















