
హైదరాబాద్: కరీంనగర్ లో కేంద్రమంత్రి బండి సంజయ్ ఇంటికి సమీపంలో కాల్పులు జరిగాయి. కేంద్రమంత్రి ఇంటి వెనుక పిఎంజె జువెల్లర్ షాపులో పట్ట పగలే చోరీ జరిగింది. పిఎంజె జ్యువెలరీ షాపులోకి చొరబడిన ఏడుగురు దుండగులు సిబ్బందిపై విచ్చక్షణారహితంగా కాల్పులు జరపడంతో ఒకరు మృతి చెందగా నలుగురు తీవ్రంగా గాయపడడంతో ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం వారిని హైదరాబాద్ లో ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. కరీంనగర్ జిల్లా జడ్జి క్వార్టర్ వెనుక వైపు ఈ ఘటన జరిగింది. ఏడుగురు దొంగలు నలుగురిపై కాల్పులు జరిపి బంగారం ఎత్తుకుపోయారు. సంఘటన స్థలానికి అతి సమీపంలో అంతకు అరగంట ముందే కేంద్ర మంత్రి బండి సంజయ్ సిసి రోడ్డు శంకుస్థాపన చేసి వెళ్లిపోయారు. ముందు రోజు శనివారం రాత్రి పోలీసులు నాకా బందీ నిర్వహించారు. అర గంట ముందు వరకు పోలీసు బందోబస్తు ఉన్నప్పటికీ ముఠా దోపిడీకి పాల్పడింది. కోర్టు వెనకాల లైన్ లో మ్యాగజైన్ లభ్యమైంది. పోలీసులు దొంగల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.












