
హైదరాబాద్: బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడడంతో తెలుగు రాష్ట్రాలలో వర్షాలు కురిసే అవకాశం ఎక్కువగా ఉంది. తెలంగాణలో నేటి నుంచి 28 వరకూ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఐఎండి అధికారులు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్ లోనూ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పిన రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఏలూరు, పోలవరం ప్రాంతాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. కోస్తా జిల్లాల్లో చెదురుమదురు జల్లులు కురుస్తాయి.











