హైదరాబాద్: ప్రధాని మోడీపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. బంగారం కొనవద్దని, విమానాల్లో ప్రయాణం చేయవద్దని ప్రధాని చెప్పడం వైఫల్యం అవుతుందని ఆయన అన్నారు. విదేశీ విధానంలో ప్రధాని విఫలమయ్యారని ఆయన విమర్శించారు. సోమవారం సిఎం రేవంత్ రెడ్డి విలేకరులతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ.. ప్రధాని మోడీ ప్రభుత్వ వైఫల్యం.. ప్రభుత్వ అసమర్థ విధానాలు కప్పిపుచ్చుకోవడానికి ప్రజలకు ఈ విధంగా పిలుపు ఇచ్చారని, ఇది భాద్యతారాహిత్యమైందని విమర్శించారు.

ఈ పరిస్థితుల గురించి తమ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ ఆరు నెలల క్రితమే హెచ్చరించారని ఆయన గుర్తు చేశారు. ఇప్పటికైనా ప్రతిపక్షాల సూచనలను తీసుకోవడానికి అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించాలని ఆయన సూచించారు. దీనిపై కేంద్రానికి స్పష్టమైన విధానం లేదని ఆయన విమర్శించారు.