
ఢాకా: బంగ్లాదేశ్ అధ్యక్షు మహ్మద్ షాబుద్దీన్ తన పదవికి రాజీనామా చేశారు. అనారోగ్య కారణాలతోనే ఆయన తన పదవికి రాజీనామా చేశారని పేర్కొంటూ స్థానిక మీడియా వెల్లడించింది. మాజీ న్యాయవాది, అవామీ లీగ్ పార్టీకి చెందిన షాబుద్దీన్ 2023 ఏప్రిల్‌లో అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. నాటి నుంచి అదే స్థానంలో కొనసాగుతున్నారు. పదవీకాలం 2028 ఏప్రిల్ వరకు ఉన్నప్పటికీ.. ముందుగానే అధ్యక్ష పదవి నుంచి దిగిపోవాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. షేక్ హసీనా పదవీచ్యుతురాలైనప్పటి నుంచి షాబుద్దీన్ తన అధ్యక్ష పదవి నుంచి వైదొలగాలని అనుకుంటున్నట్లు పలుమార్లు బహిరంగానే వెల్లడించారు.











