పాకిస్థాన్‌లోని బలోచిస్థాన్ ప్రావిన్స్ బొగ్గు గనిలో శుక్రవారంనాడు భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 34 మంది కార్మికులు మరణించగా, పలువురు శిథిలాల కింద చిక్కుకున్నారు. క్వెట్టా సమీపంలో సోరేంజ్‌లో ఈ ప్రమాదం జరిగింది. గనిలో మిథేన్ వాయువు భారీగా పేరుకుపోవడంతో ప్రమాదం జరిగినట్టు అధికారులు చెబుతున్నారు. ఘటన జరిగిన వెంటనే సహాయక బృందాలు రంగంలోకి దిగి 34 మృతదేహాలను వెలికి తీశారు. 22 మంది కార్మికులను సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. క్షతగాత్రులను సమీప ఆసుపత్రులకు తరలించారు. మృతుల కుటుంబాటలకు రూ.5 లక్షలు (పాక్ కరెన్సీ), క్షతగాత్రులకు రూ.3 లక్షలు ఎక్స్‌గ్రేషియా ఇస్తామని బలోచిస్థాన్ మంత్రి షోయిబ్ నోషెర్వాని ప్రకటించారు.