కర్ణాటకలోని బెంగళూరులో ఓ ఆకతాయి చేసిన పనికి అమ్మాయి దీటుగా బదులిచ్చారు. హెబ్బల్ నుంచి మాన్యతాకు వెళ్తున్న బస్సులో ఓ వ్యక్తి అమ్మాయిని లైంగికంగా వేధించాడు. ఆ అమ్మాయి ఏమాత్రం భయపడకుండా వెంటనే స్పందించి అతడిని నిలదీసింది. అంతేకాకుండా బస్సులోని ఇతర ప్రయాణికుల ముందే అతడిని చితకబాది తన ధైర్యాన్ని చాటుకుంది. ఈ  విషయాన్ని డ్రైవర్‌కు చెప్పడంతో వెంటనే డ్రైవర్ బస్సును ఆపేసి ఆకతాయికి తగిన బుద్ధి చెప్పారు. బస్సులో ఆ యువతి సదరు వేధింపుల వ్యక్తిని కొడుతున్న దృశ్యాలను తోటి ప్రయాణికులు కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో ఇది దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. స్థానికుల సమాచారం మేరక ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు యువతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారణ ప్రారంభించారు.