
హైదరాబాద్: ఐపిఎల్‌లో భాగంగా జైపూర్‌లోని సవాయి మాన్‌సింగ్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌పై ఢిల్లీ క్యాపిటల్స్ ఘన విజయం సాధించింది. ఆర్‌ఆర్‌పై డిసి ఏడు వికెట్ల తేడాతో గెలుపొంది. ఆర్‌ఆర్ తొలుత బ్యాటింగ్ చేసి 226 పరుగుల లక్ష్యాన్ని డిసి ముందు ఉంచింది. డిసి మూడు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. కెఎల్ రాహుల్ 40 బంతుల్లో 75 పరుగులు చేసి విజయంలో కీలక పాత్ర పోషించాడు. దీంతో అతడికే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది. మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో జైశ్వాల్ తొలి బంతి సిక్స్ కొట్టి రెండో బంతి గాల్లోకి లేపి అతడికే క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అనంతరం జేమీసన్ బౌలింగ్‌లో వైభవ్ సూర్యవంశీ తొలి బంతిని ఫోర్‌గా మలిచాడు. అనంతరం రెండో బంతి యార్కర్ వేయడంతో వైభవ్ బ్యాట్ అంచుకు తాకి వికెట్లను గిరాటేసింది. దీంతో జేమీసన్ ఓవర్‌గా ప్రవర్తించాడు. వైభవ్ కళ్లలోకి చూస్తూ గట్టిగా అరిచాడు.

దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వైభవ్ ఔటైనప్పుడు ఢిల్లీ అటగాళ్లు అతిగా సంబరాలు చేసుకోవడంతో విమర్శలు వస్తున్నాయి. అతడు 15 ఏళ్ల బుడ్డోడు కాస్తా సహనంగా ఉంటే మంచిదని జేమీసన్ కు నెటిజన్లు చురకలంటిస్తున్నారు. వైభవ్‌ను త్వరగా ఔట్ చేస్తే ఈ మ్యాచ్ గెలిచినట్టేనని ఢిల్లీ ఆటగాళ్లు అనుకొని ఉండడంతోనే సంబరాలు చేసుకున్నారని డిసి అభిమానులు సోషల్ మీడియాలో స్పందిస్తున్నారు. వైభవ్ సూర్యవంశీని త్వరగా ఔట్ చేస్తే సగం మ్యాచ్ గెలిచినట్టేనని డిసి అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. వైభవ్ నాలుగు పరుగులు చేసి మైదానం వీడడంతో ఢిల్లీ ఆటగాళ్లు సంబరాలు చేసుకున్నారని డిసి అభిమానులు సోషల్ మీడియాలో స్పందిస్తున్నారు. అతి పిన్న వయసులోనే అంతర్జాతీయ బౌలర్లు వైభవ్ చుక్కలు చూపించాడని, బుడ్డోడి ఆటతీరుతో సీనియర్లపై ఎలాంటి ప్రభావం చూపించిందో ఆర్థం చేసుకోవాలని ప్రియాంక్ స్పందించారు.












