ముంబై: శ్రీలంకతో జరిగే రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో టీమిండియా సీనియర్ ఫాస్ట్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా బరిలోకి దిగడం సందేహంగా మారింది. రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ కోసం టీమిండియా త్వరలో శ్రీలంక వెళ్లనుంది. ఈ సిరీస్ కోసం ఇప్పటికే జట్టును ప్రకటించారు. శుభ్‌మన్ గిల్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. టీమిండియాలో సీనియర్ బౌలర్ బుమ్రాకు చోటు కల్పించారు.

అయితే బుమ్రా పూర్తి ఫిట్‌నెస్ సాధించక పోవడంతో అతను సిరీస్‌లో ఆడడం కష్టంగా మారింది. ఇదే జరిగితే ఇది టీమిండియాకు పెద్ద ఎదురు దెబ్బగానే చెప్పాలి. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ రేసులో నిలువాలంటే ఈ సిరీస్‌లో తప్పక గెలవాల్సిన పరిస్థితి భారత్‌కు నెలకొంది. ఇలాంటి స్థితిలో బుమ్రా సేవలు అందుబాటులో లేకుంటే టీమిండియాకు ఇబ్బందులు ఎదురయ్యే ఛాన్స్ ఉంది.