జాతీయ అవార్డు గ్రహీత ధనుష్ ప్రధాన పాత్రలో ’ఆర్‌ఆర్ స్టూడియోస్’, ’వండర్‌బార్ ఫిలిమ్స్’ సంయుక్తంగా ’డి55’ ప్రాజెక్ట్‌ని నిర్మిస్తున్నాయి.. ’అమరన్’ లాంటి బ్లాక్ బస్టర్ సక్సెస్ తర్వాత రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ కొత్త చిత్రానికి ‘ఓం’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ సందర్భంగా. దర్శకుడు రాజ్‌కుమార్ పెరియసామి మాట్లాడు తూ ‘ధనుష్ , శ్రేయస్, ఇందులో నటిస్తున్న ఇతర నటీనటులంద రూ ఎంతో అంకితభావంతో పని చేస్తున్నారు. ముఖ్యంగా మమ్ము ట్టి , సాయి పల్లవి, శ్రీలీల, ఇంద్రన్, అనేకమంది ప్రతిభావంతులై న నటులు ఈ చిత్రంలో భాగమయ్యారు. అందరి కృషి ఫలితంగా ఈ చిత్రం అద్భుతంగా రూపుదిద్దుకుంటోంది‘ అని అన్నారు. అక్టోబర్ 16న ఈ సినిమా విడుదల కానుంది. దర్శకుడు రాజ్‌కుమార్ పెరియసామి, ఈసారి ప్రేక్షకులను కట్టిపడేసే వినూత్నమైన స్క్రీన్‌ప్లేతో ఒక భారీ యాక్షన్ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.