న్యూఢిల్లీ: మరో ఐదు రోజుల్లో ప్రతిష్ఠాత్మక కామన్వెల్త్ గెమ్స్‌కు తెరలేవనుంది. గ్లాస్గో వేదికగా జరుగనున్న ఈ మెగా క్రీడల్లో పాల్గొనే భారత బృందాన్ని ఒలింపిక్ విజేతలు మీరాబాయి చాను(వెయిట్ లిఫ్టింగ్), లొవ్లీనా బొర్గోహైన్(బాక్సింగ్)లు సారధ్యం వహించనున్నారు. ఈ విషయాన్ని శనివారం భారత ఒలింపిక్స్ సంఘం అధికారికంగా ప్రకటించింది. ఈనెల 23న ఆరంభమయ్యే ఆరంభ వేడుకలో మీరాబాయి, లవ్లీనాలు 126 మందితో కూడిన భారత బృందానికి ముందునడుస్తూ పతకధారులుగా వ్యవహరించనున్నారని పేర్కొంది. ఛాను, లవ్లీవాలో ఒకరు మువ్వన్నెల జెండాను ఎత్తుకుని నడవనుండగా.. మరొకరు కామన్వెల్త్ క్రీడా జ్యోతిని పట్టుకొని నడుస్తారని భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలు పిటి ఉష తెలిపారు.