బీజింగ్: నైరుతి చైనాలోని చాంగ్కింగ్ నగరంలో భారీ వర్షాలకు వరదలు బీభత్సం సృష్టించడంతో కొండచరియలు విరిగిపడి 8 మంది మృతి చెందారు. మరో 34 మంది గల్లంతయ్యారు. చాంగ్కింగ్ శివార్లలోని పెంగ్ షుయ్ కౌంటీలో రెండ్రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల ఈ ప్రమాదం జరిగింది. కొండపై నుంచి భారీ ఎత్తున రాళ్లు, మట్టి కుప్పకూలడంతో పలు భవనాలు నేలమట్టమయ్యాయి. సుమారు 3,000 క్యూబిక్ మీటర్ల పరిమాణం ఉన్న ఓ పెద్ద బండరాయి కొండపై నుంచి దూసుకు రావడంతో పలు ఇండ్లు, వాహనాలు నేలలో కూరుకు పోయాయి. సమాచారం అందుకున్న రెస్క్యూ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని 1,100 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.