చాక్లెట్ ఆశచూపి  చిన్నారిపై అఘాయిత్యానికి ఒడిగట్టిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.నిజామాబాద్ 6 టౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ ఘాతుకం జరిగింది. వివరాల్లోకి వెళితే.. ఓ బాలిక ఇంటి సమీపంలోని దుకాణానికి వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో అసద్ బాబానగర్‌కు చెందిన ఒక వ్యక్తి బాలికను  చాక్లెట్ ఇస్తానని నమ్మబలికాడు. ఆ చిన్నారిని బలవంతంగా పక్కకు లాక్కెళ్లి, ఆమె పట్ల అత్యంత అసభ్యకరంగా ప్రవర్తించాడు. నిందితుడి బారి నుంచి తప్పించుకున్న బాలిక.. ఏడుస్తూ ఇంటికి చేరుకుని జరిగిన విషయాన్ని  తల్లిదండ్రులకు వివరించింది. కుమార్తె చెప్పిన మాటలు విని తీవ్ర దిగ్భ్రాంతికి గురైన తల్లిదండ్రులు వెంటనే స్థానిక 6 టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు  పోలీసులు నిందితుడిపై తక్షణమే కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.