రాష్ట్రంలో చిన్నారులపై అఘాయిత్యాలు పెరిగాయని, మహిళలకు రక్షణ లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మాజీ ఎంఎల్‌ఎ, బిఆర్‌ఎస్ నాయకురాలు గొంగిడి సునిత ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఆడ పిల్లల్ని కనాలంటే భయపడే పరిస్థితి ఉందని అన్నారు. తెలంగాణ భవన్‌లో మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడారు. ఫోక్సో కేసులు దేశంలో 6 శాతం నమోదు అయితే ఒక్క తెలంగాణలో 16 శాతం ఫోక్సో కేసులు నమోదు అయ్యాయని విమర్శించారు. తెలంగాణలో క్రైమ్ రేట్ పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి రాష్ట్రంలో శాంతి భద్రతలపై ఇప్పటి వరకు సమీక్ష చేయలేదని మండిపడ్డారు. నాగర్‌కర్నూల్ జిల్లాలో కాంగ్రెస్ సర్పంచ్ చిన్నారిపై దాడి చేస్తే

పోలీసులు సెటిల్‌మెంట్ చేశారని ఆరోపించారు. కోటిమంది మహిళలను కోటీశ్వరులను చేస్తామని సిఎం అంటున్నారని, ముందు తెలంగాణలో చిన్నారులను కాపాడాలని పేర్కొన్నారు. తెలంగాణలో మహిళలపై జరుగుతున్న దాడులు సోనియాగాంధీ, ప్రియాంక గాంధీకి తెలియవా..? అని ప్రశ్నించారు. బండి భగీరధ్ కేసు విషయంలో తొలుత బలహీనమైన సెక్షన్లు పెట్టారని, రాష్ట్రంలో మహిళలు రోడ్డు ఎక్కితే అప్పుడు సెక్షన్లు మార్చారని గుర్తు చేశారు. చిన్నారులపై అఘాయిత్యాలపై పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలిన డిమాండ్ చేశారు. కెసిఆర్ సిఎంగా ఉన్నప్పుడు మహిళలకు ధైర్యం ఉండేదని అన్నారు.