
ఎఫ్‌ఐఆర్‌లో సంచలన విషయాలు వెలుగులోకి...!
హైకోర్టులోనూ చుక్కెదురు : నాలుగు వారాలకు వాయిదా
మన తెలంగాణ/హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం రేపిన సహచర మహిళా ట్రైనీ ఐపిఎస్ అధికారిణి వేధింపుల కేసులో నిందితు డు ట్రైనీ ఐపిఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి రాజేంద్రనగర్‌లోని ఉప్పరపల్లి కోర్టు బుధవారం 14 రోజుల రిమాండ్ విధించింది. వచ్చే ఆగస్టు 11 వర కు ఆయనకు రిమాండ్ ఖరారు చేస్తూ కోర్టు తీర్పు వెలువరించింది. పోలీసులు ఉదయ్ కృష్ణారెడ్డిని చంచల్‌గూడ జైలుకు తరలించారు. అయితే, అం తకుముందు ఈ కేసు విచారణ సందర్భంగా కోర్టులో డిఫెన్స్ అడ్వకేట్, ప్రాసిక్యూషన్ (పిపి) మధ్య సుదీర్ఘంగా వాదనలు సాగాయి.
డిఫెన్స్ అడ్వ కేట్ వాదనలు వినిపిస్తూ పోలీసులు బిఎన్‌ఎస్ సెక్షన్ 35(3) నిబంధనలను తీవ్రంగా ఉల్లంఘించారని, తన క్లయింట్‌కు ఎలాంటి ముందస్తు నోటీ సులు ఇవ్వకుండానే అరెస్ట్ చేశారన్నారు. సరైన ప్రాథమిక విచారణ లేకుండానే సస్పెండ్ చేయడం చట్ట ప్రకారం చెల్లదని, తగిన ఆధారాలు లేక పోయినా అరెస్ట్ చేశారని పేర్కొన్నారు. ఉదయ్ కృష్ణారెడ్డి విచారణకు పూర్తిగా సహకరించేందుకు సిద్ధంగా ఉన్నారని, కాబట్టి రిమాండ్‌ను తిరస్క రించి బెయిల్ మంజూరు చేయాలని కోరారు.
మరొకవైపు బాధిత మహిళా ట్రైనీ ఐపిఎస్ అధికారిణి జూలై 15న నేషనల్ పోలీస్ అకాడమీలో నూ, ఆ తర్వాత జూలై 17న పోలీసులకు అధికారికంగా ఫిర్యాదు చేసిన విషయాన్ని ప్రాసిక్యూషన్ కోర్టు దృష్టికి తెచ్చింది. దీనిపై సమగ్ర విచా రణ జరిపేందుకు అకాడమీ కూడా ఆగస్టు 5న హాజరుకావాలని ఉదయ్ కృష్ణారెడ్డికి షోకాజ్ నోటీసులు జారీ చేసిందని వివరించింది. ఇరువర్గా ల సుదీర్ఘ వాదనలు విన్న న్యాయస్థానం మొదట తీర్పును రిజర్వ్‌లో ఉంచి, అనంతరం రిమాండ్ విధిస్తూ నిర్ణయం ప్రకటించింది.
ఎఫ్‌ఐఆర్‌లో సంచలన విషయాలు వెలుగులోకి...!
కాగా, నేషనల్ పోలీస్ అకాడమీలో తోటి ట్రైనీ ఐపిఎస్ అధికారిణి ఇచ్చిన ఫిర్యాదుతో నమోదు అయిన ఎఫ్‌ఐఆర్‌లో పలు సంచలన, దిగ్భ్రాంతి కర అం శాలు వెలుగు చూశాయి. బాధితురాలు అందించిన వివరాల ప్రకారం నిందితుడు ఉదయ్ కృష్ణారెడ్డి ఆమెపై మానసికంగా, శారీరకంగా తీవ్రస్థా యిలో వేధిం పులకు పాల్పడినట్లు తెలిసింది. బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్న దాని ప్రకారం ఉదయ్ కృష్ణారెడ్డి ఆమెను వాట్సాప్ ద్వా రా లైంగి కంగా వేధించ డమే కాకుండా, వారిద్దరి మధ్య రిలేషన్‌షిప్ ఉందంటూ తోటి ట్రైనీ ఐపిఎస్ అధికారుల వద్ద అసత్య ప్రచారాలు చేశాడు. అంత టితో ఆగకుండా, మరో ట్రైనీ అధికారితో ఆమెకు అక్రమ సంబంధం ఉందంటూ నిరాధారమైన ఆరోపణలు చేస్తూ అవమానించాడు. బాధి తురాలిని అత్యంత అస భ్యకరమైన పదాలతో దూషిస్తూ మానసిక క్షోభకు గురిచేసినట్లు సమాచారం.
బాధితురాలికి తెలియకుండానే ఆమె వ్యక్తి గత వీడియోలను రికార్డు చేసిన ఉదయ్, వాటి ఆధారంగా ఆమెను బ్లాక్‌మెయిల్ చేయడానికి యత్నించాడని బాధితురాలు పేర్కొంది. ఆ వీడియో లను ఆమె భర్తకు పంపిం చి తీవ్ర మనోవేదనకు గురిచేశాడు. అంతేకాకుండా ఆమె మొబైల్ ఫోన్‌ను బలవంతంగా తన గదికి తీసుకెళ్లి, పాస్‌వర్డ్ చెప్పా లంటూ బెదిరింపు లకు పాల్పడ్డాడని బాధితురాలు తెలిపింది. అదే సమయంలో ఆమెను అసభ్యకరంగా తాకుతూ, తీవ్రంగా వేధించినట్లు ఫిర్యా దులో నమోదైంది. ఈ నెల 9వ తేదీ రాత్రి బాధితురాలిని బలవంతంగా తన గదికి తీసుకెళ్లి బంధించిన ఉదయ్ కృష్ణారెడ్డి, ఆమె జుట్టు పట్టుకుని లాగి, గొంతు నులి మేందుకు ప్రయత్నించాడు.
గది నుంచి బయటకు వెళ్లకుండా మెడపై కత్తి పెట్టి భయభ్రాంతులకు గురిచేశాడు. ఆమెను అవ మానించే ఉద్దేశంతో మూడు కండోమ్ ప్యాకెట్లను ఆమెపైకి విసిరాడు. అనంతరం ఈ నెల 10వ తేదీ ఉదయం కూడా ఆమెపై తీవ్రం గా శారీరక దాడికి పాల్పడ్డాడు. అకాడమీలో ఇతరుల సమక్షంలోనూ అసభ్యకరంగా మాట్లాడి ఆమె పరువుకు భంగం కలిగించాడని బాధితు రాలు తెలిపింది. ఈ ఘటనలపై సమగ్ర విచారణ జరిపి నిందితుడిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు.
ట్రైనీ ఐపిఎస్‌కు హైకోర్టులో చుక్కెదురు: 4 వారాలకు వాయిదా
ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి హైకోర్టులో చుక్కెదురైంది. తనపై అత్తాపూర్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసును కొట్టివేయాలని కోరుతూ ఆయ న దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ విచారణను న్యాయస్థానం నాలుగు వారాలకు వాయిదా వేసింది. ఈ కేసులో బాధితురాలికి నోటీసులు ఇవ్వాల్సి ఉందని పబ్లిక్ ప్రాసిక్యూటర్ పల్లె నాగేశ్వరరావు కోర్టు దృష్టికి తీసుకురావడంతో, నోటీసులు జారీ చేయాలని ఆదేశిస్తూ హైకోర్టు విచారణను వాయిదా వేసింది.











