
లండన్: టీం ఇండియా స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు సరికొత్త చరిత్ర సృష్టించారు. అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధికంగా సంయుక్తంగా 400 మ్యాచ్‌లు ఆడిన భారత జోడీగా రికార్డు సాధించారు. ఇంగ్లండ్‌తో లార్డ్స్ వేదికగా జరుగుతున్న మూడో వన్డే సందర్భంగా ఈ ఫీట్‌ని నమోదు చేశారు. ఇక మొత్తంగా అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన జోడీగా శ్రీలంక దిగ్గజాలు కుమార సంగక్కర-మహేళ జయవర్ధనే కొనసాగుతున్నారు. వీరిద్దరు కలిసి శ్రీలంక తరఫున 550 మ్యాచులు ఆడాకరు. ఆ తర్వాత మూడు స్థానాల్లోనూ శ్రీలంక ఆటగాళ్లే ఉండటం విశేషం. ఇక రోహిత్, కోహ్లీల జోడీ ఈ జాబితాలో 6వ స్థానంలో కొనసాగుతోంది.
కాగా, 2007లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన రోహిత్ శర్మ ఇప్పటివరకూ 67 టెస్టులు, 159 టి-20లు, 287 వన్డేలు ఆడాడు. ఇక 2008లో అరంగేట్రం చేసిన విరాట్ కోహ్లీ 123 టెస్టులు, 125 టి-20లు, 313 వన్డేలు పూర్తి చేసుకున్నాడు.











