
నేడు అర్ధరాత్రి ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్
స్పెయిన్-అర్జెంటీనా మధ్య తుదిపోరు
సర్వత్రా ఉత్కంఠ
న్యూయార్క్: ఫిఫా వరల్డ్ కప్ తుది దశకు చేరుకుంది. ఆదివారం అర్ధరాత్రి 12:30 గంటలకు జరిగే ఫైనల్‌తో ఈ మెగా టోర్నీకి తెరపడనుంది. డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనా, మాజీ ఛాంపియన్ స్పెయిన్ టైటిల్ పోరుకు సిద్ధమయ్యాయి. లీగ్ దశ నుంచి ఒక్క మ్యాచ్‌లో ఓడకుండా ఫైనల్లో అడుగు పెట్టిన ఇరు జట్ల మధ్య పోరు హోరాహోరీ సాగనుంది. అయితే ఈ రెండు జట్లలో ఎవరు ఛాంపియన్‌గా నిలుస్తారో అనేది ఆసక్తికరంగా మారింది. ఇరు జట్లలో అద్భుతంచేసే ఆటగాళ్లకు కొదవాలేదు. అయితే స్పెయిన్ ‘టికీటాకా’ వ్యూహాలతో అద్భుతాలు చేస్తుంటే.. లియొనల్ మెస్సీ సారధ్యంలోని జట్టు అసాధరణమైన ఆటతీరుతో విజయాన్ని అందుకోవాలని చూస్తోంది. 2010 ప్రపంచకప్‌లో స్పెయిన్ ఇదే తత్వంతో విజేతగా నిలిచి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. ఆ టోర్నమెంట్‌లో స్పెయిన్ ఏ మ్యాచ్‌లోనూ నాలుగు లేదా ఐదు గోల్స్ కొట్టలేదు. కానీ ఒక్కో గోల్‌తోనే మ్యాచ్‌లను గెలిచింది.
నాకౌట్ దశలో పోర్చుగల్‌పై 1-0, పరాగ్వేపై 1-0, జర్మనీపై 1-0, ఫైనల్లో నెదర్లాండ్స్‌పై అదనపు సమయంలో 1-0తో గెలిచి ప్రపంచ ఛాంపియన్‌గా అవతరించింది. ఇక డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనా డిఫెండర్లు బంతి ఎక్కడికి వెళ్తుందో ముందుగానే పసిగట్టి అక్కడికి చేరుకొని బంతిని తమ నియంత్రణలోకి తీసుకుంటున్నారు. జాన్ ముస్సో, ఎమిలియానో మార్టిన్ప్ వంటి గోల్ కీపర్లు ఉండగా వారికి తోడు లియొనల్ మెస్సీ, నికోలాస్ తంగాలియాఫికో, గొంజెలో మొంటేల్, లిసాండ్రో, క్రిస్టియన్ రోమారియో. ఫాకండో మెడినా వంటి డిఫెండర్లతో అర్జెంటీనా జట్టు పటిష్టంగా ఉంది. దీంతో ఇరు జట్ల మధ్య హోరాహోరీ ఖాయంగానే కనిపిస్తోంది.











