
హైదరాబాద్: మాజీ రాష్ట్రపతి 'భారతరత్న' డాక్టర్ ఎపిజె అబ్దుల్ కలాం వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ మహనీయుడికి వినమ్ర నివాళులర్పించారు. భారత అంతరిక్ష, క్షిపణి సాంకేతిక రంగాల అభివృద్ధిలో విశేష కృషి చేసి, రక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేయడంలో డాక్టర్ అబ్దుల్ కలాం పాత్ర చిరస్మరణీయమని స్మరించుకున్నారు. రాష్ట్రపతిగా, శాస్త్రవేత్తగా, ఉపాధ్యాయుడిగా వారు చూపిన నిబద్ధత, నిరాడంబర జీవనం, అసాధారణ ప్రతిభకు, అచంచలమైన దేశభక్తికి ప్రతీకగా నిలిచిన డాక్టర్ అబ్దుల్ కలాం జీవితం ప్రతి భారతీయుడికి ఆదర్శప్రాయమని సిఎం పేర్కొన్నారు.











