
ప్రభుత్వ నిల్వలను దారి మళ్లీస్తే కఠిన చర్యలు
పెండింగ్ సిఎంఆర్ బకాయిలను మిల్లులవారీగా సమీక్షిస్తాం
విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆధ్వర్యంలో తనిఖీలు
ధాన్యం కొనుగోలు, కనీస మద్దతు ధర చెల్లింపులకు ఆటంకం ఉండదు
సమీక్షా సమావేశంలో నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి
మన తెలంగాణ/హైదరాబాద్: ప్రభుత్వ నిల్వలను దారి మళ్లీస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, పెండింగ్ సిఎంఆర్ బకాయిలను మిల్లులవారీగా సమీక్ష చేస్తామని నీటిపారుదల, ఆహార- పౌరసరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్. ఉత్తమ్‌కుమార్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆధ్వర్యంలో తనిఖీలు చేపడుతామని రైతుల ధాన్యం కొనుగోలు, కనీస మద్దతు ధర చెల్లింపులకు ఎలాంటి ఆటం కం ఉండదని మంత్రి కెప్టెన్ ఎన్. ఉత్తమ్‌కుమార్ రెడ్డి అన్నారు. రైతుల ప్రయోజనాలను పరిరక్షించడం, ప్రజాధనంతో కొనుగోలు చేసిన ప్రతి ధా న్యం గింజకు లెక్క తేల్చడం, కస్టమ్ మిల్లింగ్ వ్య వస్థలో పూర్తి పార దర్శకతను తీసుకురావడమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు.
ప్రభుత్వానికి చెంది న ధాన్యం, బియ్యం నిల్వలను దారి మళ్లీంచ డం, దుర్వినియోగం చేయడం లేదా సిఎంఆర్ బకాయిలను సకాలంలో చెల్లించకుండా ప్రజాధనానికి నష్టం కలిగించడం వంటి చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని మంత్రి హెచ్చరించారు. ధాన్యం సేకరణ, నిల్వలు, కస్టమ్ మి ల్లింగ్, ప్రభుత్వానికి బియ్యం అప్పగింత, బకాయిల వసూలు, ప్రభుత్వ నిల్వల పరిరక్షణతో పాటు డిఫాల్టర్ రైస్ మిల్లులపై తీసుకోవాల్సిన చట్టపరమైన చర్యలపై సోమవారం సాయంత్రం మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి అధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు నుంచి ఎఫ్‌సిఐకి బియ్యం అప్పగించే వరకు మొత్తం వ్యవస్థలోని ప్రతి దశను సమగ్రంగా పరిశీలించాలని అధికారులను మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఆదేశించా రు.
ఈ సమీక్ష రైస్ మిల్లింగ్ పరిశ్రమ మొత్తానికి వ్యతిరేకంగా చేపట్టిన చర్య కాదని మంత్రి ఉత్త మ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రంలో వందలాది మంది రైస్ మిల్లర్లు దశాబ్దాలుగా ప్రభుత్వంతో నిజాయితీగా పనిచేస్తూ రాష్ట్ర వ్యవసా య ఆర్థిక వ్యవస్థకు, ప్రజాపంపిణీ వ్యవస్థకు వి శేషంగా సహకరిస్తున్నారని మంత్రి పేర్కొన్నారు. నిబంధనలకు అనుగుణంగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న నిజాయితీగల మిల్లర్లకు ప్రభుత్వం సం పూర్ణ సహకారం అందిస్తుందని మంత్రి భరోసా ఇచ్చారు. అయితే, కొంతమంది మిల్లర్లు ప్రభు త్వం తమపై ఉంచిన తరువాయి 9లో











