ఢిల్లీ: ఈ ప్రభుత్వాన్ని ఇంటికి పంపే సమయం ఆసన్నమైందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శించారు. విద్యావ్యవస్థ పునర్నిర్మాణంలో తొలి అడుగు పడిందని అన్నారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు...దేశవ్యాపంగా విద్యార్థుల పోరాటం చూసి గర్విస్తున్నానని, అణచివేతకు గురైన ఏ వర్గమైనా ధైర్యంగా నిలబడి పోరాడాలని సూచించారు. వీధుల్లోకి వచ్చి పోరాడిన యువత, విద్యార్థులకు రాహుల్ గాంధీ అభినందనలు తెలియజేశారు. మరో రెండు డిమాండ్లు మిగిలి ఉన్నాయని తెలియజేశారు. ప్రధాని నరేంద్ర మోడీ క్షమాపణ చెప్పాలని, విద్యార్థులపై జరిగిన లాఠీఛార్జిపై విచారణ జరపాలని రాహుల్ గాంధీ అన్నారు.