హైదరాబాద్: డ్రగ్స్ మత్తులో ఓ యువకుడు పోలీసులపైకి కారు ఎక్కించిన సంఘటన హైదరాబాద్‌లోని అబిడ్స్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..... అబిడ్స్‌లో డ్రగ్స్ కొనుగోలు చేస్తున్నారనే సమాచారంతో పోలీసులు తనిఖీలు చేపట్టారు. కారులో ఉన్న సైఫ్ అనే వ్యక్తి మరో వ్యక్తి డ్రగ్స్ ప్యాకెట్ ఇస్తుండగా వారిని పోలీసులు పట్టుకున్నారు. కారులో ఉన్న సైఫ్‌ను బయటకు దిగాలని పోలీసులు తెలిపారు. అతడు కారు దిగకుండా ముందుకు పోనివ్వడంతో కానిస్టేబుల్ తీవ్రంగా గాయపడ్డాడు. ఈ సిఐ అడ్డుకునే ప్రయత్నం చేయడంతో అతడికి కూడా గాయాలయ్యాయి. సిఐ శ్రీకాంత్‌తో పాటు కానిస్టేబుల్ మహేందర్ కూడా గాయపడడంతో ఆస్పత్రికి తరలించారు. నిందితుడిని అఫ్జల్‌గంజ్ వద్ద అదుపులోకి తీసుకున్నారు.