నవతెలంగాణ – మల్హర్ రావుమండలంలోని వళ్లెంకుంట గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సర్పంచ్ బొమ్మ రజిత, సిఈఓ సంతోష్ బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రైతులు దళారులను ఆశ్రయించకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలని సూచించారు. తేమ 17 శాతం మించకుండా పాక్యూ వచ్చిన తరువాత టోకెన్ తీసుకొని విక్రయించాలని తెలిపారు. కార్యక్రమంలో మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు, రైతులు, హమాలి కార్మికులు పాల్గొన్నారు.
The post ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం appeared first on Navatelangana.














