న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి పదవికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో ఢిల్లీలో పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. ఢిల్లీకి రావాలన మహారాష్ట్ర సిఎం దేవేంద్ర ఫడ్నవీస్‌కు అధిష్ఠానం నుంచి పిలుపు వచ్చింది. సిఎంతో పాటు డిప్యూటీ సిఎం షిండేకు కూడా ఢిల్లీ పెద్దల నుంచి పిలుపు వచ్చింది. కీలక నేతలకు హైకమాండ్ పిలుపు రావడంతో రాజకీయాల్లో ఉత్కంఠ నెలకొన్నది.

కేబినెట్‌లో భారీ మార్పులకు కేంద్రం సిద్ధమవుతుందన్న ఊహాగానాలు వ్యాపించాయి. ఫడ్నవీస్‌కు కేంద్రంలో విద్యా శాఖను అప్పగించవచ్చునని రాజకీయ వర్గాలు అంటున్నాయి. కేంద్ర కేబినెట్ మార్పులు చేర్పులు జరగవచ్చునని గత కొంతకాలంగా రాజకీయ వర్గాలలో ఊహాగానాలు వెలువడుతున్నాయి. మంత్రులలో కొందరికి ఉద్వాసన పలికి, కొత్తగా మరికొందరికి అవకాశాలు ఇవ్వాలని బిజెపి పెద్దలు భావిస్తున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే, ఇప్పుడు ప్రధాన్ రాజీనామాతో మార్పులు అనివార్యంగా మారింది.