నారాయణపేట జిల్లా కేంద్రంలో ఎసిబి అధికారులు దాడులు నిర్వహించారు. ఆర్ డిఒ రామచందర్ నాయక్ లంచం తీసుకుంటుండగా ఎసిబి అధికారులు పట్టుకున్నారు.  రామచంద్ర నాయక్ రూ. 25000 లంచం తీసుకుంటూ ఎసిబి అధికారులకు పట్టుబడ్డాడు. ఆర్ డిఎ ఇంటిలో ఎసిబి సోదాలు కొనసాగుతున్నాయి. ఎవరైనా అధికారులు లంచం డిమాండ్ చేస్తే ఎసిబి టోల్ ఫ్రీ నెంబర్ 1064ను సంప్రదించాలని, వారి చిరునామాను గోప్యంగా ఉంచుతామని ఎసిబి అధికారులు వెల్లడించారు.