
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర ప్ర భుత్వం రైతులకు అండగా నిలుస్తూ రై తు భరోసా పథకం కింద రెండోవిడత ని ధులను విడుదల చేసిందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తె లిపారు. దీంతో 45,11,947 మంది రైతులు లబ్ధి పొందనున్నారని, ఈ క్ర మంలో రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ. 2,206.06 కోట్లు నేడు (బుధవారం) జ మ కానున్నాయని మంత్రి తెలిపారు. ఇ ప్పటికే నర్మెట్టలో ఏర్పాటు చేసిన ఆయి ల్ పామ్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవ సందర్భంగా మొదటి విడతలో భాగంగా రూ. 3,446.94 కోట్లు ప్రభుత్వం రైతుల ఖాతాల్లో జమ చేశామని,
ఈ రెండు విడతలు కలిపి ఇప్పటివరకు రైతు భరోసా పథకం కింద మొత్తం రూ. 5,653 కోట్లు విడుదల చేసినట్టు ఆయన తెలిపారు. దీని ద్వారా మొత్తం 71.06 లక్షల మంది రైతులు లబ్ధి పొందారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వివరించారు. రైతుల సంక్షేమానికే ప్రభుత్వం తొలి ప్రాధాన్యం ఇస్తుందని , వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేస్తామని మంత్రి తుమ్మల తెలిపారు. మొత్తం సోమవారం నాటికి 71,05,572 మంది రైతుల ఖాతాల్లో రూ.5,653,00,36,827 కోట్లు జమ అయ్యాయని మంత్రి తుమ్మల తెలిపారు.



