న‌వ‌తెలంగాణ‌-హైదరాబాద్‌: తమిళనాడు ఎన్నికల ఫలితాల్లో టీవీకే సంచలనం సృష్టించింది. పెరంబూర్, తిరుచ్చి ఈస్ట్ నుంచి టీవీకే అధినేత విజయ్ బరిలోకి దిగి గెలిచారు. అయితే ఇందులో ఒక స్థానాన్ని విజయ్ వదులుకోవాల్సి ఉంటుంది. తిరుచ్చి ఈస్ట్ ఎమ్మెల్యే పదవికి విజయ్ రాజీనామా చేస్తారని ప్రచారం జరుగుతోంది. అయితే ఇక్కడి నుంచి ఉప ఎన్నికలో విజయ్ సన్నిహితురాలు, హీరోయిన్ త్రిష పోటీ చేస్తారని వార్తలు వస్తున్నారు. ఇదే జరిగితే టీవీకే ప్రభుత్వంలో త్రిష కీలక పాత్ర పోషించనున్నారు.

The post ఎమ్మెల్యే పదవికి విజయ్ రాజీనామా..ఉప ఎన్నికలో త్రిష పోటీ? appeared first on Navatelangana.