
మేడ్చల్: తెలంగాణ రాష్ట్రంలో రెండు వేర్వేరు అగ్ని ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా బాచుపల్లిలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ప్రగతి నగర్ కమాన్ నుంచి బాచుపల్లి వెళ్లే ప్రధాన రహదారిలో మై స్పేస్ సమీపంలో సోమవారం అర్ధరాత్రి ఆరు ఫర్నీచర్ దుకాణాల్లో మంటలు చెలరేగాయి. పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడడంతో అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. గతంలో ఈ ప్రాంతంలో అగ్ని ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. ప్రాణ నష్టం లేదు కానీ భారీగా ఆస్తినష్టం జరిగింది.
మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని పిస్తా హౌస్ సమీపంలో ఫంక్షన్ హాల్ లో అగ్ని ప్రమాదం జరిగింది. మంటలు భారీ ఎత్తున్న చెలరేగడంతో ఫంక్షన హాల్ పూర్తిగా దగ్ధమైంది. స్థానికుల సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పేశారు. షాట్ సర్క్యూట్ తోనే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని అనుమానాలు వ్యక్త మవుతున్నాయి.











