మహాత్మా జ్యోతిబా పూలే బిసి గురుకుల డిగ్రీ కళాశాలల్లో 2026 -27 విద్యా సంవత్సరానికి ప్రవేశాల కోసం దరఖాస్తు గడువును ఈ నెల 16 వరకు పొడిగించినట్లు ఎంజెపి కార్యదర్శి బడుగు సైదులు తెలిపారు. విద్యార్థులు, తల్లిదండ్రుల వినతి మేరకు దరఖాస్తు గడువు తేదీని పొడిగించామని సోమవారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన పేర్కొన్నారు. అర్హులైన విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకొని అధికారిక వెబ్‌సైట్ mjptbcwreis.telangana.gov.in లేదా https://mjptbcadmissions.org/MJP-degree/ లో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

ఇంటర్ మార్కులను పరిగణనలోకి తీసుకుని విద్యార్థులు కోరుకున్న కోర్సులో సీటు కేటాయించడం జరుగుతుందని కార్యదర్శి వివరించారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ఉన్నత విద్యావంతులను చేయాలనుకుంటే గురుకుల విద్యాసంస్థల్లో చేర్చాలని, చదువుతో పాటు క్రమశిక్షణ నేర్చుకుంటారని ఆయన అన్నారు. ఈ ఏడాది ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని, మరిన్ని వివరాలకు ఫోన్ నెం. 040-23328266 లో సంప్రదించాలని కార్యదర్శి బడుగు సైదులు సూచించారు.