
మన తెలంగాణ/హైదరాబాద్ : ఎపిలో కరోనా విజృంభిస్తోంది. రాజమహేందవరంలో తొలి కరోనా కేసు నమోదయ్యింది. దీంతో ఎపిలో ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 16కు చేరినట్లైంది. ఆదివారం రాజమండ్రిలో 21ఏళ్ళ యువకుడికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు అధికారులు నిర్దారించారు. యువకుడిని రాజమండ్రి జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఎపిలోని వివిధ ఆస్పత్రుల్లో ఐదు గురు బాధితులు చికిత్స పొందుతున్నారు.
నలుగురు బాధితులు హోం ఐసోలేషన్‌లో ఉండగా ముగ్గురు కరోనా నుంచి కోలుకున్నారు. ఎపిలో ఇప్ప టివరకు కోవిడ్‌తో నలుగురు మృతి చెందారు. ఎపిలో కరోనా కేసులు పెరుగుతున్న క్రమంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రస్తుతం రాష్ట్రంలో నమో దవుతున్న కేసు ఒమిక్రాన్ ఆర్5 వేరియంట్‌గా గుర్తించారు. ఈ వేరియంట్ సోకినవారిలో గొంతు నొప్పి, జ్వరం, తలనొప్పి, ముక్కు కారడం, అల సట, బాడీపెయిన్స్, లాంటి లక్షణాలు ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. ఈ వేరియంట్ పట్ల ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చికిత్స తీసుకుంటే నయం అవుతుందని వైద్యులు అంటున్నారు.











