
మనతెలంగాణ, సిటిబ్యూరోః రిటైర్‌మెంట్ బెనిఫిట్స్ ఇచ్చేందుకు లంచం తీసుకుంటుండగా రికార్డ్ అసిస్టెంట్‌ను ఎసిబి అధికారులు సోమవారం రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఎస్. శివానంద్ అమీర్‌పేటలోని డిప్యూటీ ఇన్స్‌స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్‌లో రికార్డు అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు.
ఉద్యోగ విరమణ చేసిన మహిళా పింఛన్ బెనిఫిట్స్ ఫైల్ పైఅధికారులకు పంపించేందుకు రూ.20వేలు ఇవ్వాలని రికార్డ్ అసిస్టెంట్ డిమాండ్ చేశాడు. దీంతో మహళా ఉద్యోగి కుమారుడు ఎసిబి అధికారులకు ఫిర్యాదు చేశాడు. వారి సూచనల మేరకు రికార్డ్ అసిస్టెంట్‌కు రూ.20వేలు లంచం ఇస్తుండగా ఎసిబి అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. తర్వాత నిర్వహించిన కెమికల్ పరీక్షలో పాజిటివ్ రావడంతో అరెస్టు చేసి నాంపల్లిలోని ఎసిబి కోర్టులో హాజరు పర్చారు. కోర్టు నిందితుడికి 14 రోజులు రిమాండ్ విధించడంతో ఎసిబి అధికారులు చంచల్‌గూడ జైలుకు తరలించారు.












