
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న గర్భవిచ్ఛిత్తి చట్టాల ను సుప్రీంకోర్టు గురువారం తీవ్రస్థాయిలో తప్పుపట్టింది. ఈ చట్టాలను సవరించాల్సి ఉందని ప్రధాన న్యాయమూర్తి సూ ర్యకాంత్, జస్టిస్ జాయ్‌మాల్యా బాగ్చీతో కూడిన ధర్మాసనం గురువారం స్పష్టం చేసింది. ఒక 15 సంవత్సరాల బాలిక అ త్యాచారానికి గురై, ఆమె 30 వారాల గర్భం విచ్ఛిత్తికి అంతకు ముందు సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పుపై స్పందించారు. ఇ న్నినెలల గర్భ విచ్ఛిత్తి వైద్యపరంగా సరికాదని దీనిపై ఢిల్లీలోని ఎయిమ్స్ క్యూరేటివ్ పిటిషన్‌కు దిగింది. సుప్రీంకోర్టు తీర్పును పక్కకు పెట్టాలని కోరింది. దీనిపై అత్యున్నత ధర్మాసనం స్పం దించింది. ఎయిమ్స్ పిటిషన్ అనుచితం అని పేర్కొంది బాలిక ఓ వైపు అవాంఛనీయ గర్భం మోయడం, విచారణపరమైన జాప్యంతో తలెత్తే సమస్యలను కూడా ఎదుర్కోవల్సి రావడం బాధాకరం అవుతుందని తెలిపారు. అత్యాచారాలు ఇతరత్రా చర్యలతో గర్భధారణ సంబంధిత కేసులలో చట్టాలను ప్రభుత్వం సమూలంగా మార్చాల్సి ఉంటుంది. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా గర్భవిచ్ఛిత్తి విషయంలో ఎన్ని వారాలు అనేది చూడటానికి వీల్లేదని తెలిపారు.
అత్యాచారం కేసులలో విచారణలు వారం రోజులలో ముగిసి, న్యాయం జరిగేలా చూడాల్సి ఉంటుంది. వైద్యపరమైన ఇతరత్రా కారణాలతో మైనర్‌కు తన గర్భవిచ్ఛితికి అనుమతిని కల్పించకపోవడం వల్ల సంబంధిత బాధితురాలు ఆ తరువాత జీవితాంతం ఈ మాయని మచ్చ ఎదుర్కోవల్సి ఉంటుంది. పైగా తాను సొంతంగా నూతన జీవితం ఎంచుకోవడానికి వీలుండదని తెలిపారు. పూర్తి స్థాయిలో వైకల్యం ఇతరత్రా దీర్ఘకాలిక అనారోగ్య తీవ్రతలు లేకపోతే ఆ బాధితురాలికి ఈ గర్భం కాలంతో సంబంధం లేకుండా విచ్ఛిత్తికి పాల్పడవచ్చునని తెలిపారు. ఇటువంటి క్యూరేటివ్ పిటిషన్లు ఈ చిన్నారి విషయంలో కుదరవు. ఇప్పుడు ఆమె చదువుకునే వయస్సులో ఉంది, అయితే ఆమెను మనం ఈ దశలో తల్లి కావాలనుకుంటున్నాం, ఈ దశలో ఆమె తరువాత తన జీవితాంతం ఎంతటి బాధను భరించాల్సి ఉంటుందో ఊహించుకుంటేనే ఇబ్బందిగా అన్పిస్తుందని తెలిపారు. ఈ కేసుకు సంబంధించి బాలిక ఎంతటి బాధను భరిస్తూ వస్తున్నదో ఒక్కసారి పరిశీలించాల్సి ఉంటుందని పేర్కొన్నారు.
ఎయిమ్స్ న్యాయవాదులు ఈ విషయంలో బాధితురాలి తల్లిదండ్రులను ముందుగా సంప్రదించాలి. తరువాతి క్రమంలో గర్భవిచ్ఛిత్తి సంబంధిత నిర్ణయం బాధితురాలి తుది నిర్ణయానికి వదిలిపెట్టాలని ధర్మాసనం తెలిపింది. 15 ఏండ్ల బాలిక ఇప్పుడు గర్భం కొనసాగించాల్సి వస్తే, తరువాత ఈ బాలిక బిడ్డను దత్తత తీసుకోవడానికి ఎవరో ఒకరు రావచ్చు.ఈ దేశంలో అనేక రకాల సానుభూతి , స్వాంతనలు ఉండనే ఉంటాయి, అయితే మన ముందు ఎందరో దిక్కులేని పిల్లలు, తల్లిదండ్రులు వదిలేసి వెళ్లితే తల్లడిల్లే పిల్లలు కన్పిస్తూ ఉంటారు. వీధులలో వీరి పరిస్థితి బాధాకరం అవుతుంది. పైగా పిల్లలతో ఆటలాడుకునే క్రూర స్థాయి మాఫియాలు కూడా ఉంటున్నాయని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. వాటికి ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించింది. ఈ దశలో ఎయిమ్స్ డాక్లర్లు కలుగచేసుకుని తమ వాదన విన్పించారు. ఈ బాలిక విషయంలో తలెత్తుతున్న విషయం బాలికకు గర్భస్థ శిశువుకు సంబంధించిన విషయం కాదు, బాలిక దశలోని వ్యక్తికి, తరువాత పుట్టబోయే బిడ్డకు సంబంధించిన విషయం అని తెలిపారు.









