తెలుగు రాష్ట్రాల్లో ప్రయాణికుల రద్దీ దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. గుంటూరు, - చర్లపల్లి (హైదరాబాద్ శివార్లు) మధ్య రెండు ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది. వినాయక చవితి పండుగ అనంతరం తిరుగు ప్రయాణంలో రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈ ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. రైలు నంబర్ 07227 - గుంటూరు నుండి చర్లపల్లికి సెప్టెంబర్ 6 న రాత్రి 9.45 గంటలకు బయలు దేరి మరుసటి రోజు ఉదయం 4 గంటలకు చర్లపల్లికి చేరుకుంటుంది. రైలు నంబర్ 07228 - చర్లపల్లి నుండి గుంటూరుకు

సెప్టెంబర్ 7న రాత్రి 11.50 గంటలకు బయలు దేరి మరుసటి రోజు ఉదయం 6.10 గంటలకు గుంటూరు చేరుకుంటుంది. ఈ రెండు ప్రత్యేక రైళ్లు రెండు దిశల్లోనూ సత్తెనపల్లి, పిడుగురాళ్ల, నడికుడి జంక్షన్, మిర్యాలగూడ, నల్గొండ స్టేషన్‌లలో ఆగుతాయి. ప్రయాణికుల సౌకర్యార్థం ఈ రైళ్లలో అన్ని తరగతుల కోచ్‌లను ఏర్పాటు చేశారు. సెకండ్ రెసి (2ఎ), థర్డ్ ఎసి (3ఎ), స్లీపర్ క్లాస్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు అందుబాటులో ఉంటాయి. టికెట్లు ఐఆర్‌సిటిసి వెబ్‌సైట్, రైల్వే రిజర్వేషన్ కౌంటర్లలో అందుబాటులో ఉన్నాయని, ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని దక్షిణ మధ్య రైల్వే అధికారులు కోరారు.