
ప్రయాణీకుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే గుంటూరు - వికారాబాద్ మధ్య ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. రైలు నెం. 07227గుంటూరు - వికారాబాద్ ప్రత్యేక రైలు ఈ నెల 30న ఆదివారం రాత్రి 9.45 గంటలకు గుంటూరు నుండి బయలు దేరి మరుసటి రోజు ఉదయం 5 గంటలకు వికారాబాద్ చేరుకుంటుంది. రైలు నెం. 07228 వికారాబాద్ గుంటూరు ప్రత్యేక రైలు ఈ నెల 31న సోమవారం రాత్రి 10 గంటలకు వికారాబాద్ నుండి బయలు దేరి మరుసటి రోజు ఉదయం 6.10 గంటలకు (మరుసటి గుంటూరు చేరుకుంటుంది. ఈ ప్రత్యేక రైళ్లు రెండు దిశల్లో సత్తెనపల్లి, పిడుగురాళ్ల, నడికుడి, మిర్యాలగూడ, నల్గొండ, చర్లపల్లి, సికింద్రాబాద్, బేగంపేట, లింగంపల్లి స్టేషన్లలో ఆగుతాయి. ఈ రైళ్లలో 2 ఎ, 3 ఎ, స్లీపర్ క్లాస్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్లు ఉంటాయి.
పిడుగురాళ్లలో ప్రయోగాత్మక హాల్ట్
విజయవాడ - లింగంపల్లి - విజయవాడ ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్కు పిడుగురాళ్ల రైల్వే స్టేషన్లో ఒక నిమిషం ప్రయోగాత్మక స్టాపేజీ కల్పించారు. ఈ స్టాపేజీ సెప్టెంబర్ 4 నుండి ఆరు నెలల పాటు అమల్లో ఉంటుంది. రైలు నెం. 12795 విజయవాడ - లింగంపల్లి ఇంటర్ సిటీ ఎక్స్ప్రెస్ విజయవాడ నుండి సాయంత్రం 5.30 గంటలకు బయలు దేరి పిడుగురాళ్లకు సాయంత్రం 7.08 గంటలకు చేరుకుంటుంది. నిమిషం పాటు ఆగి అక్కడి నుండి బయలు దేరి రాత్రి 11.35 గంటలకు లింగంపల్లికి చేరుకుంటుంది. రైలు నెం. 12796 లింగంపల్లివిజయవాడ ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ లింగంపల్లి నుండి తెల్లవారుజామున 4.40 గంటలకు బయలు దేరి పిడుగురాళ్లకు ఉదయం 8.06 గంటలకు చేరుకుంటుంది. నిమిషం పాటు ఆగి అక్కడి నుండి బయలు దేరి విజయవాడకు ఉదయం 10.35గంటలకు చేరుకుంటుంది.








