బీఆర్ఎస్ అంటే పార్టీ కాదు. ఓక విప్లవం. నెత్తురు నుండి ఒక జాతి ఎత్తిన జెండా అని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. పార్టీ ఆవిర్బావం సందర్భంగా నేతలకు, కార్యకర్తలకు శుబాకాంక్షలు తెలిపారు. పాతికేళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకుంటున్న సందర్భంగా స్వీయ రాజకీయ అస్థిత్వ పతాకం రెపరెపలాడుతూ సిల్వర్ జూబ్లి ముగింపు వేడుకను జరుపుకుంటున్న సన్నివేశాన్ని, 25 వసంతాల మైలురాయిని అధిగమించిన మహోజ్వల లాంగ్ మార్చ్ అని కేసీఆర్ ఫోటోను ట్వీట్ చేశారు.